Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు కాలంలో భారత వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 21.8 శాతం పెరిగి 7.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.59వేల కోట్లు)కు చేరాయి. గతేడాది ఇదే కాలంలో కరోనా కారణంగా 6.4 బిలియన్ డాలర్ల (రూ.47వేల కోట్లు) ఎగుమతులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో పోల్చినప్పుడు గడిచిన ఐదు మాసాల ఎగుమతుల్లో భారీ పెరుగుదల చోటు చేసుకున్నది. వ్యవసాయ, వ్యవసాయ ప్రాసెస్డ్ అహార ఉత్పత్తుల ఎగు మతుల అథారిటీ (అపెడ) గుర్తించిన 37 ఉత్పత్తులకు సంబంధించి గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 20 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10-15శాతం పెరుగుదల ఉండొచ్చ ని అపెడా అంచనా వేసింది. గడిచిన ఐదు మాసాల్లో బియ్యం ఎగుమతులు 13.7 శాతం పెరిగి 3.8 బిలియన్ డాలర్లు (రూ.28వేల కోట్లు)గా నమోదయ్యాయి.పండ్లు, కూరగా యల్లో 6.1 శాతం వృద్థితో 1.08 బిలియన్ డాలర్లు (రూ.7.9 వేల కోట్లు)గా ఉన్నాయి. మాంసం, డెయిరీ ఉత్పత్తులు 31.1 శాతం పెరిగి 1.55 బిలియన్ డాలర్ల (రూ.11.43 వేల కోట్లు)కు చేరాయి. జీడిపప్పు ఎగుమతులు 28.5 శాతం వృద్థితో 185 మిలియన్ డాలర్లు (రూ.136 కోట్లు)గా చోటు చేసుకున్నాయి.
ఈ ఖరీఫ్‌లో 150.50 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంచనా..
2020-21 ఖరీఫ్ సీజన్లో వరి, పప్పుధాన్యాలు, ముతక తృణధాన్యాలు కలిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరనున్నదని(150.56 మిలియన్ టన్నులు) కేంద్రవ్యవసాయ శాఖ అంచనా వేసింది.వరి, చెరకు, పత్తిలో రికార్డు స్థాయిలోఉత్పత్తి జరుగుతున్నదనీ, అయితే ముతక తృణధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి స్వల్పంగా తగ్గుతుందని గుర్తించింది.