Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చేవారం ఉత్తర్వులు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ వెల్లడించారు. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది చందర్ ఉదరు సింగ్‌తో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ ఈ విషయాన్ని తెలిపారు. పెగాసస్‌పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో చందర్ ఉదరు సింగ్ ఒకరు. వాస్తవానికి ఈ కమిటీ ఏర్పాటుపై ఈ వారంలో ఉత్తర్వులు జారీచేయాలని సుప్రీంకోర్టు భావించింది. అయితే కొంతమంది నిపుణులు వ్యక్తిగత కారణాల వల్ల కమిటీలో భాగం కావడానికి తమ అభ్యంతరం వ్యక్తం చేశారనీ, అందువల్ల ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడానికి ఆలస్యం జరిగిందని కూడా సీజేఐ తెలిపారు. అతిత్వరలో సభ్యులను ఖరారు చేసి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి సెప్టెంబరు 13న మధ్యంతర ఉత్తర్వులను రిజర్వు చేసింది. కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తాం తప్పితే, ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్ కానీ, ఇతరత్రా ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఉపయోగిస్తోందా? లేదా? అని చెప్పే అఫిడవిట్ దాఖలుకు కేంద్రం మరోసారి విముఖత వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని తాము అడగట్లేదని, చట్ట ప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో నిఘా సాఫ్ట్వేర్ ఉపయోగించారా? లేదా? అన్నది తెలుసుకోవాలనుకుం టున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.