Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యోగి పాలనలోసాధువులు,సన్యాసులకు రక్షణ కరువు..
- మిస్టరీలో మారుతున్న మర్డర్లు
- భూ సామ్రాజ్యం, పీఠాలకోసం బలవుతున్న బాబాలు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జంగల్‌రాజ్ కొనసాగుతున్నదని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. చిన్నా,పెద్ద అనే తేడాలేకుండా మారణకాండ కొనసాగుతున్నదని కేంద్రం సేకరించిన నేర చరిత్రలో స్పష్టమవుతున్నది. ఓటు,మత రాజకీయం చేసే బీజేపీ పాలనలో.. సాధువులు,సన్యాసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలో..నాలుగేండ్లు..42 మంది సాధువులను చనిపోయారు. కొందర్ని కాల్చిచంపితే..మరికొందర్ని గొంతుకోసి చంపారు. ఇంకొందరు అనుమానాస్పదరీతిలో చనిపోయారు. ఆస్తి, పీఠాలు, భూ సామ్రాజ్యాలు చుట్టూ..కాషాయపార్టీ నేతల ప్రమేయం వెరసి వారి సాధువులను మృత్యువు వెంటాడుతున్నది. అఖాడ పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్రగిరి అనుమానస్పద మరణం వెనుక కూడా అయోధ్య భూముల కుంభకోణమే కారణమా..! లేక మరోకటా..అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నరేంద్రగిరి మర్డర్‌కు ముందు సూసైడ్ నోట్ అతనిదేనన్న శిష్యుడు, ఆ తర్వాత ఆ నోట్ రాసినది మహంత్ కాదని పోలీసులకు చెప్పాడు. దీంతో ఈ మర్డర్ కేసు మిస్టరీగా మారింది. అయితే గతంలో జరిగిన సాధువులు,సన్యాసుల హత్యలకు సంబంధించిన కీలకకేసులు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారి కుదుపురేపాయి. రాష్ట్రంలో కీలకమైన ప్రాంతాల్లో ఉన్న 42 మంది సాధువులు హతమయ్యారు. 2019 లో.. శ్రీ నిరంజని పంచాయతీ అఖాడా కార్యదర్శి మహంత్ ఆశిష్ గిరి అనుమానాస్పదమరణం ఇప్పటికీ రహస్యమే. అదేవిధంగా.. 2018 లో డియోరియాలో సాధు సజ్జారామ్, హర్భజన్, శిష్యుడి హత్య, రారు బరేలీలో ప్రీస్ట్ ప్రేదాస్ హత్య కూడా చర్చనీయాంశమైంది. 2019 లో.. రారు బరేలీలోని ఉంచహార్లోని రామ్ జానకి ఆలయ పూజారి బాబా ప్రేమ్‌దాస్ ఆలయ ద్వారంపై వేలాడుతూ కనిపించారు. ఆ సమయంలో సంజరు ఖత్రి రారు బరేలీ డీఎమ్‌గా ఉన్నారు, ప్రస్తుతం ఆయన యోగికి దగ్గరగా..ప్రయాగ్‌రాజ్ డీఎమ్‌గా ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం రెండేండ్లలో 20 మంది సాధువుల హత్యలకు గురయ్యారనీ, ఆ వివరాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు అజరుకుమార్ లల్లూ విడుదల చేశారు.