Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన పీఎంఓ
- మరోసారి పునరుద్ఘాటించిన బీజేపీ సర్కార్
న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ నిధి కాదనీ, ఇది సర్కారు ఖజానాకు వెళ్లదని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) తన పాత వాదనలను మరోసారి పునరుద్ఘాటించింది.పీఎంఓ అండర్ సెక్రెటరీ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ ఢిల్లీ హైకోర్టులో సమర్పించిన సమాధానంలో ఉన్నదని జాతీయ మీడియాలో వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం, ఈ ట్రస్ట్ 'ప్రభుత్వం' లేదా సమాచార హక్కు చట్టంలోని 2(హెచ్)'పబ్లిక్ అథారిటీ' అయినా..లేదా.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8 లోని సబ్ సెక్షన్లు (ఈ,జే) థర్డ్ పార్టీలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వలేమని స్పష్టంగా పేర్కొన్నాయి.పీఎం కేర్స్ ఫండ్‌ను కేంద్రం బహిర్గతం చేయాలని పీఎంఓకు రాసిన ప్రత్యుత్తరంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రధాని, హౌంమంత్రి, ఆర్థికమంత్రి వంటి కీలకమైన హౌదాల్లో ఉంటూ ఇలా సేకరించే ఫండ్స్‌పై నియంత్రణ ఉండకపోతే..ఎలా అని పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు.పీఎం కేర్ ఫండ్స్ గురించి దేశంలోని పౌరులకు తెలియాల్సిన అవసరమున్నదని కోర్టుదృష్టికి తెచ్చారు.దీనికి పై విధంగా మోడీ ప్రభుత్వం జవాబిస్తూ...తాను గౌరవ ప్రాతిపదికన ట్రస్ట్‌లో పనిచేస్తున్నానని శ్రీవాత్సవ కోర్టుకు తెలిపారు. ట్రస్ట్ పారదర్శకతతో పనిచేస్తున్నదని వివరించారు.''ట్రస్ట్ అందుకున్న నిధుల వినియోగం వివరాలతో పాటు ఆడిట్ నివేదిక పారదర్శకతను నిర్ధారించడానికి ట్రస్ట్ అధికారిక వెబ్సైట్లో ఉంచబడింది'' అని అధికారి చెప్పారు.ట్రస్ట్ అందుకున్న విరాళాలన్నీ ఆన్లైన్ చెల్లింపు, చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా స్వీకరించబడిందని కేంద్రం పేర్కొన్నది. అలాగే ట్రస్ట్‌కు వచ్చే నిధుల వ్యయాలను వెబ్సైట్లో ప్రదర్శిస్తున్నట్టు తెలిపింది.అయితే.. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో పౌరులకు సహాయం అందించడం కోసం పీఎం కేర్స్ ఫండ్‌ను మార్చి 2020 లో ప్రధాని ఏర్పాటు చేశారనీ,ట్రస్ట్ భారీ విరాళాలను పొందిందనిసమైక్ గంగ్వాల్ దాఖలు చేసిన పిటిషన్లో ప్రస్తావించారు.ట్రస్ట్ డీడ్ యొక్క కాపీని పీఎం- కేర్స్ ఫండ్ తన వెబ్సైట్లో డిసెంబర్ 2020 లో జారీ చేసినా... ఇది రాజ్యాంగం ద్వారా లేదా పార్లమెంటు ద్వారా చేసిన చట్టం ద్వారా సృష్టించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. సెక్షన్2 (హెచ్) ప్రకారం ఆర్టీఐ చట్టం కిందకే పీఎం కేర్స్ఫండ్ వస్తుందనీ,సెక్షన్ 2 (హెచ్) ఉప విభాగాల (ఎ) నుంచి (డీ) రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏదైనా అధికారం లేదా సంస్థ, పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం ద్వారా కానీ రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా కింద ఆర్డర్ లేదా నోటిఫికేషన్, ఇది పబ్లిక్ అథారిటీగా పరిగణించబడుతున్నదని వివరించారు.