Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఐదుగురికి వేధింపులు
- ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ సెంటర్లో ఘటన
రారుపూర్ : ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకున్నది. ప్రభుత్వ రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్లో వికలాంగురాలైన బాలికపై లైంగికదాడి జరిగింది. మరో ఐదుగురు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారు. అయితే, రెసిడెన్షియల్ సెంటర్ కేర్‌టేకర్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. జాశ్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితులను వేధించిన ఘటనలో రెసిడెన్షియల్ సెంటర్ వాచ్‌మెన్‌కు కూడా సంబంధం ఉన్నదని పోలీసులు చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈనెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు జాశ్పూర్ ఎస్పీ విజరు అగర్వాల్ వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతున్నదని చెప్పారు. కాగా, నిందితులిద్దరినీ కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటన వెనుక ఇంకెవరున్నా విడిచిపెట్టకూడదనీ, దర్యాప్తును సమగ్రంగా జరిపి బాధిత అమ్మాయిలకు న్యాయం కల్పించాలని తెలిపాయి. కాగా, తాజా ఘటన 2013లో కాంకర్ జిల్లాలోని రెసిడెన్షిల్ స్కూల్లో గిరిజన బాలికలపై జరిగిన దారుణాన్ని గుర్తు చేసింది. ఆ సమయంలో దాదాపు 15 మంది బాలికలు లైంగికంగా వేధింపులను ఎదుర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అప్పటి ఘటన.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.