Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : నూతన ఐటీ నిబంధనావళి అనుసరిస్తూ అధికారుల్ని నియమించడానికి ట్విట్టర్ అంగీకారం తెలిపిందని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం సమాచారమిచ్చింది. చీఫ్ కాంప్లియెన్స్ అధికారి, రెసిడెంట్ గ్రీవియెన్స్ అధికారిని, నోడల్ కాంటాక్ట్ సిబ్బందిని ట్విట్టర్ నియమించిందని కేంద్రం పేర్కొంది. ఈమేరకు ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలుచేసింది. వివిధ హోదాల్లో నియమించిన ఉద్యోగుల పేర్లను, వారి విధుల ప్రారంభ తేదీని ట్విట్టర్ పేర్కొన్నదని, నియామకాలపై తమకు సమాచారమిచ్చిందని కేంద్రం తెలిపింది. ఐటీ రూల్స్‌ను పాటించటంపై ట్విట్టర్ స్పందనేంటో తమకు తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 10న కేంద్రాన్ని ఆదేశించింది. సామాజిక మాధ్యమం, ఇంటర్నెట్ వేదికల్లో వెబ్సైట్లో వెలువడే సమాచారం, ప్రచురణ నూతన ఐటీ నిబంధనావళి, 2021కి కట్టుబడి ఉండాలని మోడీ సర్కార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీచేసింది. దీనిపై ట్విట్టర్ సహా పలు సామాజిక మాధ్యమాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.