Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మన్ కీ బాత్'లో మోడీ
న్యూఢిల్లీ : భారతీయులందరూ కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించడాన్ని కొనసాగించాలని ప్రధాని మోడీ అన్నారు. నెల చివరలో జరిగే రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలనీ, ఏ ఒక్కరూ ఈ టీకా కార్యక్రమం నుంచి మినహాయింపు కాకూడదని తెలిపారు. దేశంలో రికార్డు స్థాయిల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమం.. ప్రధాని యూఎస్ పర్యటనకు ముందు రికార్డయ్యింది. ఈ విషయాన్ని మోడీ స్వయంగా వెల్లడించడం గమనార్హం.