Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 ఏండ్లలోపు పిల్లల్లో లుకేమియా అధికం
- ఐసీఎంఆర్ క్యాన్సర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: 14 ఏండ్లలోపు చిన్నారుల్లో లుకేమియా అధికంగా ఉన్నదని తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) జాతీయ క్యాన్సర్ నివేదిక పేర్కొంది. ఐసీఎంఆర్ తాజాగా క్యాన్సర్ నివేదికను విడుదల చేసింది. ఇందులో క్యాన్సర్ రకాలు, మహిళలు, చిన్నారులుపై ప్రభావం సహా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రొగ్రామ్ (ఎన్సీఆర్పీ)లో భాగంగా 2012 నుంచి 2019 మధ్య కాలంలో మొత్తం 6.10 లక్షల క్యాన్సర్ కేసులు నమోదుకాగా, ఇందులో అత్యధికం పురుషులు ఉన్నారు. మొత్తం క్యాన్సర్ బాధితుల్లో 52.4 శాతం మంది పురుషులు ఉండగా, 47.6 శాతం మహిళలు ఉన్నారు. హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం చైల్డ్వుడ్ క్యాన్సర్లు 7.9 శాతం ఉన్నాయి. అధికంగా 14 ఏండ్లలోపు వారిలో లుకేమియా అధికంగా ఉంది.
పొగాకు కారణంగా వచ్చిన క్యాన్సర్లలో పురుషుల్లో 48.7 శాతం ఉండగా, మహిళలు 6.5 శాతం ఉన్నారు. ఇదిలావుండగా, 2012-2019 మధ్య కాలంలో ఎన్సీఆర్పీ కింద 96 ఆస్పత్రుల్లో మొత్తం 13,32,207 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 6,10,084 కేసులపై విశ్లేషణ కొనసాగుతోంది. సంబంధిత కేసుల డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నివేదిక ప్రకారం పురుషుల్లో మెడ, తల ప్రాంతాలంలోనే అధికంగా... దాదాపు మూడింట ఒక వంతు (31.2 శాతం) క్యాన్సర్ కేసులు ఉన్నాయి. ఇక స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్లు మొత్తం క్యాన్సర్లలో (51 శాతం) సగానికి పైగా ఉన్నాయి. థైరాయిడ్ క్యాన్సర్ మహిళల్లో 2.5 శాతం, పురుషుల్లో 1 శాతం ఉండగా, గాల్ బ్లాడర్ క్యాన్సర్ మహిళల్లో 3.7 శాతం, పురుషుల్లో పురుషుల్లో 2.2 శాతం ఉన్నాయి. పొగాకు ఉత్పత్తులు, కాలుష్యం వల్ల ఎక్కువగా క్యాన్సర్లు సంభవిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. వీటి కారణంగానే మగవారిలో తల, గొంతు క్యాన్సర్లు ఎక్కువ ఉన్నాయని నివేదిక పేర్కొంది.