Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయనగరం : గులాబ్ తుపాను ప్రభావంతో ఆదివారం అర్థరాత్రి నుండి సోమవారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. కంచికచర్ల మండలంలోని లక్ష్మయ్యవాగు, గంపల గూడెం మండలంలో కట్టలేరు వాగు, వత్సవాయి మండలం పొలంపల్లి వాగులు పొంగుతున్నాయి. వాగుల నుండి వస్తున్న నీరు నదిలో కలుస్తుండ ంతో నీటి ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదిలోకి 85,465 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
దీంతో ప్రకాశం బ్యారేజీకి చెందిన మొత్తం 70 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 40 గేట్లను రెండు అడుగులు, 30 గేట్లను అడుగు మేర ఎత్తి 80 వేల క్యూ సెక్కుల నీటిని దిగువకు, 5,465 క్యూసెక్కుల నీటిని కాల్వలకు విడుదల చేస్తున్నారు.