Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు ఎన్నికల సంఘానికి సుప్రీం ఆదేశం
చెన్నై : రాష్ట్రంలో పురపాలిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం కోసం తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి (టీఎన్ఎస్ఈసీ) సుప్రీంకోర్టు మరో నాలుగు నెలల సమయాన్ని కేటాయించింది. నిజానికి ఈనెల 15 లోగా ఎన్నికలు నిర్వహించాలని టీఎన్ఎస్ఈసీకి ఒక అవకాశాన్ని కల్పిస్తూ అత్యు న్నత న్యాయస్థానం జూన్ 22న ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అయితే, గడువు ముగిసిన ఈతరుణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమ కోహ్లి లతో కూడిన ధర్మాసనం తాజా ఆదేశాలను జారీ చేసింది. టీఎన్ఎస్ఈసీ తరఫున సీని యర్ అడ్వకేటు ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మరో ఆరు ముని సిపల్ కార్పొరేషన్లు, 28 కొత్త మునిసిపాలిటీలు వచ్చి చేరినందున ఎన్నికల సంబంధిత తంతును పూర్తి చేసేందుకు మరికొంత సమయం అవసరమని ధర్మాసనానికి టీఎన్ఎస్ఈసీ తెలిపింది. కారణాలు చిన్నవైనప్పటికీ మేము మరింత సమయమిస్తున్నామని రోహత్గీకి ధర్మాసనం వెల్లడించింది. ఆరునెలల సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అంగీకరించింది.