Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా మూడవ రోజు కూడా 30 వేల దిగువకు కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా 26,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు చేరింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 276 మంది చనిపోయారు. ఈ మహమ్మారి మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు 4,47, 194 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కొత్తగా 29,621 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3,29,31,972 మంది కోవిడ్ నుంచి బయటపడి ఇండ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం క్రియా శీలక కేసులు 2,99,620 మాత్రమే ఉన్నాయి. ఇక కేరళలో కూడా కరోనా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఆదివారం 15,951 కేసులు నమోదవగా, 165 మంది మతిచెందారు. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,18,362 మందికి పంపిణీ జరగ్గా, ఇప్పటివరకు 86,01,59,011 వ్యాక్సిన్ డోసులను పంపిణీ అయ్యాయి.