Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : అల్వార్‌పేటలోని సిఐటి కాలనీలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇంటి ముందు సోమవారం ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఈ ప్రయత్నాన్ని అడ్డుకుని, అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. కాగా, ఈ వ్యక్తిని తూతుకుడి జిల్లాలోని జమీన్ దేవర్కులం గ్రామానికి ఎ.వెట్రిమారన్‌గా గుర్తించారు. సర్పంచ్ పదవికి తన నామినేషన్ తిరస్కరించడంతో, నామినేషన్ ఆమోదించాలనే డిమాండ్‌తో ఈ తీవ్ర చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.