Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్ 'పంచజన్య' ఆరోపణ
న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్‌పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్ఎస్ఎస్)కు చెందిన వీక్లీ మ్యాగజైన్ 'పంచజన్య' తన తాజా ఎడిషన్ కవర్‌పేజీ కథనంలో తీవ్రమైన ఆరోపణలు చేసింది. అమెజాన్ సంస్థను 'ఈస్ట్ ఇండియా కంపెనీ-2.0'గా అభివర్ణించిన పంచజన్య.. తనకు అనుకూలమైన ప్రభుత్వ పాలసీల కోసం కోట్లాది రూపాయాలు లంచాల రూపంలో చెల్లించిందని ఆరోపించింది. '' భారత్‌ను అక్రమించుకునేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ 18వ శతాబ్ధంలో ఏం చేసిందో..ఆమెజాన్ ప్రస్తుత కార్యకలాపాల్లో కూడా అవే కనపడుతున్నాయి' అని ఈస్ట్ ఇండియా కంపెనీ-2.0 అనే టైటిల్‌తో ఉన్న కథనంలో పేర్కొంది. భారత మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని సాధించాలని అమెజాన్ అనుకుంటోందని, ఇందుకు భారత పౌరుల ఆర్థిక, రాజకీయ, వ్యక్తిగత స్వేచ్ఛను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు ప్రారంభించిందని తెలిపింది. భారత సంస్కృతి వ్యతిరేకంగా ఉండే సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లను అమెజాన్ తన వీడియో ఫ్లాట్‌ఫాం ప్రైమ్‌వీడియోలో రిలీజ్ చేస్తోందని పంచజన్య తన ఆర్టికల్‌లో విమర్శించింది. ఫ్యూచర్ గ్రూప్ స్వాధీనంపై అమెజాన్ ప్రస్తుతం చట్టపరమైన చిక్కుల్లో ఉండడంతో పాటు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) విచారణను ఎదుర్కొంటోంది.