Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డిజిల్ ధర వరుసగా రెండో రోజూ పెరిగింది. సోమవారం లీటర్ డిజిల్‌పై 25 పైసలు పెంచారు. అలాగే గత వారం రోజుల్లో డిజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. తాజా పెంపుతో లీటర్ డిజిల్ ధర దేశరాజధానిలో రూ.89.32, ముంబయిలో రూ.96.94కు చేరుకుంది. ఈ నెల 24 తర్వాత లీటర్ డిజిల్ ధర 70 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. లీటర్ పెట్రోల్ ధర దేశరాజధాని ఢిల్లీలో రూ 101.19, ముంబయిలో రూ 107.26గా ఉంది.