Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నా నియంత్రణలోనే పోలీసులు : త్రిపుర సీఎం
అగర్తలా: సివిల్ సర్వీసు అధికారులు కోర్టు ధిక్కార కేసులకు భయపడొద్దనీ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ అన్నారు. త్రిపురలోని రవీంద్ర శతబార్షికి భవన్లో 'త్రిపుర సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ 26వ ద్వైవార్షిక సదస్సు' జరిగింది. ఇందుల్లో పాల్గొన్న సీఎం బిప్లవ్ దేవ్ మాట్లాడుతూ.. అధికారులను అరెస్టు చేయడం అంత సులభంగా జరగదని చెప్పారు. 'పోలీసులకు బాస్ సీఎం. నేను సీఎం అన్న విషయం మర్చిపోవద్దు' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అలాగే, 'వారు నిర్ధిష్ట పనిని చేయలేరని చాలా మంది అధికారులు నాతో అన్నారు. ఎందుకంటే అలా చేయడం కోర్టు ధిక్కరణకు కారణమవుతుంది' అని అన్నారు. కోర్టులు తీర్పులు ఇస్తాయి. దానిని అమలు చేసేది పోలీసులు. పోలీసులు నా నియంత్రణలో ఉన్నారు. తాను పులిననీ, ప్రజలెన్నుకున్న తన పాలన కింద ఉన్న పోలీసులు భయప డాల్సిన పనిలేదన్నారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.