Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులూ ఓటర్లేనని గుర్తుపెట్టుకోండి
- సమస్యల పరిష్కారానికి ఆలోచనకూడా చేయటంలేదు
- ఇలాంటి ప్రధాన్ని ఎన్నడూ చూడలేదు
- ఆయన విధానాలన్నీ ప్రజావ్యతిరేకమే
- అన్నీ అదానీ, అంబానీలకు అమ్మేస్తున్నారు : ధర్నాలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా
- జంతర్ మంతర్లో భారీ ప్రదర్శన
- కార్మిక, వ్యవసాయ కార్మిక, మహిళ, విద్యార్థి సంఘాలు సంఘీభావం
న్యూఢిల్లీ : రైతులు అన్నదాతలు మాత్రమే కాదని, ఓట్లేసే (ఓటు దాత) ఓటర్లు కూడా అని, తగిన సమయంలో మోడీ సర్కార్కు గుణపాఠం నేర్పుతారని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా హెచ్చరిం చారు. తాను తొమ్మిది మంది ప్రధాన మంత్రులను చూశా ననీ, కానీ ఇలాంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరే, దేశ వ్యతిరేక ప్రధాన మంత్రిని ఎన్నడూ చూడలేదని అన్నారు. ప్రధాని మోడీ అవలంభిస్తున్న విధానాలన్నీ దేశంలోని సమస్త ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తెచ్చి పెట్టేవేనని స్పష్టం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చిన భారత్ బంద్ సందర్భంగా సోమ వారం నాడిక్కడ జంతర్ మంతర్లో భారీ ప్రదర్శన జరి గింది. కార్మిక, వ్యవసాయ కార్మిక, మహిళ, విద్యార్థి సంఘా లు సంఘీభావం తెలిపాయి. స్థానిక బరోడా బ్యాంక్ నుంచి జంతర్ మంతర్ పార్క్ వరకు నిర్వహించ తలపెట్టిన ర్యాలీ ని ఢిల్లీ పోలీసులు భారీ స్థాయిలో బారికేడ్లు ఏర్పాటుచేసి అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే నాయకులు, కార్యకర్తలు భైఠాయించారు. ప్రదర్శనలో కార్యకర్తలంతా ప్లకార్డులు చేబూని ''కిసాన్ మజ్దూర్ ఏక్తా జిందాబాద్, మోడీ సర్కార్ డౌన్ డౌన్, నల్ల చట్టాలు రద్దు చేయాలి, లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలి'' అన్న నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా హన్నన్ మొల్లా మాట్లాడుతూ దేశంలోని రైతులందరితో పాటు కార్మిక వర్గం, విద్యార్థులు, యువత, మహిళలు, ఇతర వర్గాల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు వీధిల్లోకి వచ్చి, రోడ్లపై ఆందోళన చేస్తున్నా రనీ, కానీ ప్రభుత్వం సమస్యల ను పరిష్కరించేందుకు కనీసం ఆలోచన కూడా చేయటం లేదని విమర్శించారు. ఏదేమైనా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం అలా మొండిగా వ్యవహారిం చడం దారుణమన్నారు. ప్రస్తు తం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతి రేక విధానాలు అమలు చేస్తున్నదని, దేశంలోని ప్రతిదాన్ని అదానీ, అంబానీలకు అమ్మేందుకే పని చేస్తుందని ధ్వజమె త్తారు. రైతులు అన్నదాతలే కాదనీ, ఓటేసే ఓటర్లని, ఓటు వేసే సమయం వచ్చినప్పుడు తగిన పాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తన జీవితంలో ఇలాంటి ప్రజా వ్యతిరేక, ఫాసిస్ట్ వైఖరి ప్రధాన మంత్రిని చూడలేదని అన్నారు.
మోడీ సర్కార్ ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి ఉంటుం దనీ, రైతులతో పాటు ప్రజలందరూ తిరిగి గట్టి సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రైతులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలనీ, లేకపోతే రైతుల పోరాటం మరింత తీవ్రరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. నవంబర్ 26న రైతు పోరాటానికి ఏడాది అవుతుందనీ, ఆ రోజు భారీ స్థాయిలో పోరాటానికి నాంది పలుకుతామని హెచ్చరించారు. తమ పోరాటానికి మద్దతిస్తున్న ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు భవిష్యత్తు పోరాటానికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే, కోశాధికారి పి.కష్ణప్రసాద్, సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధూ, ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అనురాగ్ సక్సేనా, ట్రాన్స్పోర్టు యూనియన్ నేత ఆర్.లక్ష్మయ్య, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శులు అమర్ జిత్ కౌర్, హర్భజన్ సింగ్, ఏఐసీసీటీయూ నేత సుచిత దేవ్, ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు విపి సానూ, తదితరులు పాల్గొన్నారు.