Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజుల చెల్లించలేని దుస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు
- మాఫీ చేయాలంటూ పాఠశాల యాజమాన్యాలకు వేడుకోలు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతుండటంతో వరసగా రెండో ఏడాది కూడా తమ పిల్లల స్కూలు ఫీజు చెల్లించలేని దుస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఫీజులు మాఫీ చేయాలని లేదా ఫీజు చెల్లింపునకు మరింత వ్యవధి ఇవ్వాలని యాజమాన్యాలను వేడుకుంటున్నారు. ఈ పరిస్థితి మహమ్మారి వలన ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తుందని పాఠశాలల అధిపతులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయినవారు, స్థిరమైన ఉద్యోగం దొరకని వారు లేదా వ్యాపారాలు పుంజుకోని తల్లిదండ్రులు పాఠశాలలకు ఇలాంటి విజ్ఞప్తులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ పాఠశాలలోనూ ఇలాంటి వినతులు గత ఏడాది కంటే అధికంగా ఉన్నాయి. ఎక్కువ కుటుంబాల్లో సంపాదించే ఏకైక వ్యక్తి మృత్యువాత పడ్డారు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు కరోనా రెండో దశలో తమ తల్లిదండ్రులను పొగొట్టుకున్నారు. ఇక మరికొన్ని కుటుంబాలు తమకు కోవిడ్ చికిత్స కోసం తమ సంపదలను మొత్తం వ్యయం చేశాయి. దీంతో ఇలాంటి కుటుంబాలు ఫీజు మాఫీ కోసం లేదా వ్యవధి కోసం పాఠశాలల యాజమాన్యాలను ప్రాధేయపడుతున్నాయి.