Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్
- ఏపీలో జాషువా జయంతి వేడుకలు
గుంటూరు : మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. జాషువా స్ఫూర్తిప్రదాత అని, ఆదర్శనీయుడని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మహాకవి జయంతి సందర్భంగా గుంటూరులో జరిగిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. జాషువా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అంటరాని తనాన్ని రుపుమాపేందుకు పాటుపడిన మహనీయుడు జాషువా అని కొనియాడారు. గుంటూరులో తలపెట్టిన జాషువా కళా పీఠం నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. అనంతరం విలేకర్లు పలు అంశాలను ప్రస్తావించగా మంత్రి స్పందిస్తూ, రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే పదవి నుంచి వైదొలగేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. పదవుల విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. జాషువాకు నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు ముస్తాఫా, మద్దాలి గిరిధర్, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.