Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతిక కారణాలరీత్యా జిగేష్ మద్దతు
న్యూఢిల్లీ:సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుజరాత్ దళిత నేత, స్వతంత్ర ఎమ్మెల్యే జిగేష్ మేవాని సాంకేతిక కారణాల రీత్యా పార్టీలో చేరకపోయినప్పటికీ, తన మద్దతు ప్రకటించారు. ప్రస్తుత గుజరాత్ అసెంబ్లీలో జిగేష్ స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరితే పార్టీ ఫిరాయింపులు కింద అనర్హత వేటు పడే అవకాశముంది. విలేకరుల సమావేశంలో కన్నయ్య కుమార్, జిగేష్ మేవాని, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, మరో సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా మాట్లాడారు. వచ్చే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తానని మేవాని తెలిపారు.
పార్లమెంటరీ ధోరణితోనే కన్నయ్య వెళ్లిపోయాడు
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
పార్లమెంటరీ దోరణితోనే కన్నయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరాడని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. మంగవారం విలేకరుల సమావేశంలో సీపీఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి దినేష్‌తో కలిసి డి.రాజా మాట్లాడారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై చాలా సార్లు అడిగామనీ, కానీ ఆయనెప్పుడూ సూటిగా, నిజాయితీగా చెప్పలేదని అన్నారు. మధ్యాహ్నం 1.19 గంటలకు కన్నయ్య తన రాజీనామాను మెయిల్ ద్వారా పంపించాడనీ, అందులో దేశంలోని నెలకొన్న పరిస్థితుల రీత్య తాను ఇంకా తన బాధ్యతల్లో కొనసాగలేనని పేర్కొన్నాడని చెప్పారు