Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమం కేంద్రాల్లో ఘనంగా షహీద్ భగత్ సింగ్ జయంతి
- పాల్గొన్న ఎస్కేఎం నేతలు రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్
న్యూఢిల్లీ : దేశ రాజధాని సరిహద్దుల్లోని రైతు ఉద్యమ కేంద్రాల్లో విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోదుడు షహీద్ భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, యువత పెద్ద ఎత్తు న సరిహద్దులకు చేరుకున్నారు. భగత్ సింగ్‌ను స్మరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానీయున్ని గుర్తు చేసుకున్నారు. అన్యాయంపై పోరాటంలో భగత్ సింగ్ స్ఫూర్తి రైతులకు ఒక ఆయుధమని పేర్కొన్నారు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్‌పూర్, పల్వాల్ సరిహద్దుల్లో భగత్ సింగ్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాజీమ్లో భారీ కిసాన్ మహా పంచాయత్ జరిగింది. వేలాది మంది రైతులు, ముఖ్యంగా మహిళ రైతులు పాల్గొన్నారు. రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్‌తో పాటు అనేక మంది ఎస్కేఎం నేతలు పాల్గొని కిసాన్ మహా పంచాయత్‌ని ఉద్దేశించి మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరతో అన్ని వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు చట్టపరమైన హామీని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కోసం కొనసాగుతున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మహా పంచాయత్ ఆరు తీర్మానాలను ఆమోదించింది.