Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రత్యేక లక్షణాలతో కూడిన 35 పంట రకాలను ప్రధాని మోడీ మంగళవారం ఆవిష్కరించారు. వాతావరణ మార్పులు, పోషకాహార లోపాల సవాళ్లను పరిష్కరించడంలో భాగంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) వీటిని అభివృద్ధి చేసింది. అన్ని ఐసీఏఆర్ ఇనిస్టిట్యూట్లు, రాష్ట్ర, కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కషి విజ్ఞాన్ కేంద్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ఈ కొత్త పంట రకాలను జాతికి అంకితం చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ప్రభుత్వాలు, సమాజం.. ఈ మూడు కలిసి పనిచేసినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. కరవు తదితర కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడంతోపాటు అధిక పోషక విలువలు కలిగిన వరి, గోదుమ, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంట రకాలు ఇందులో ఉన్నాయి. కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాజధాని రారుపూర్‌లో నూతనంగా నిర్మించిన 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్' క్యాంపస్‌ను ప్రధాని ప్రారంభించారు.