Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్తులు, సిబ్బంది..అంతా బదిలీ!
- అక్టోబరు 1 నుంచి అమల్లోకి..
న్యూఢిల్లీ : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్మికులు ఆందోళన చెందిన ట్టుగానే ఆర్డినెన్స్ బోర్డ్‌ను కేంద్రం రద్దు చేసింది. అంతే కాదు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని ఫ్యాక్టరీ ఆస్తుల్ని, అందులో పనిచేస్తున్న సిబ్బందిని ఏడు ప్రభుత్వ కంపెనీల్లో విలీనం చేస్తున్నామని, ఈ ఆదేశాలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తున్నాయని కేంద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రక్షణ విభాగాల తయారీలో అత్యంత కీలకమైన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలు కార్మికులు, ఇతర ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రక్షణరంగంలో కీలకమైన ఆర్డినెన్స్‌ను ప్రయివేటీకరణ దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రం యత్నిస్తోందని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి. 'దేశ వ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 41 యూనిట్లకు సంబం ధించి నిర్వహణ, నియంత్రణ, ఆపరేషన్స్, మెయింటెనె న్స్‌లపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ప్రొడక్షన్, నాన్ ప్రొడక్షన్ యూనిట్ల న్నింటినీ ఏడు కేంద్ర ప్రభుత్వ కంపెనీల్లో విలీనం అవుతున్నాయి'' అని కేంద్రంప్రకటించింది. దేశ త్రివిధ దళాలకు అవసరమ య్యే మందు గుండు సామాగ్రి, ఆయుధాలు, వాహనాలు, సైనికులకు దుస్తులు, పరికరాలు, అధునాతన తుపాకాలు మొదలైనవి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలే ఉత్పత్తి చేస్తు న్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందర్నీ కొత్తగా ఏర్పాటుచేసిన 'డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్' విభాగాల్లో విలీనం చేస్తున్నామని తాజా ప్రకటనలో కేంద్రం పేర్కొంది.