Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే భారంగా మారి సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతు న్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరలను పెంచుకుంటూ పోతున్నది. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ధరలు మంగళ వారం 20 పైసలు పెరగగా, డీజిల్ 25 పైసలు పెరిగాయి. ఈ పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ధర లీటరుకు రూ. 101.39కు చేరుకుంది. దేశ రాజధానిలో ఒక లీటర్ డీజిల్‌ను రూ.89.57కు విక్రయిస్తు న్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.47, డీజిల్ ధర లీటరుకు రూ.97.21కు చేరింది. ఇక హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్‌పై 19 పైసలు పెరిగి ధర రూ.101.46కి చేరింది. డీజిల్ పై 27పైసలు పెరిగి రూ.97.7కు చేరింది. చమురు, గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రజలు ఓ పక్క డిమాండ్ చేస్తుంటే.. కేంద్ర సర్కార్ మొండిగా వ్యవహరిస్తున్నది. ధరల వరుస బాదుడుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.