Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న రైతు ఉద్యమం
న్యూఢిల్లీ: మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం కొనసాగుతోంది. బుధవారం నాటికి రైతు ఉద్యమం 307 రోజు పూర్తి చేసుకున్నది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాహజన్పూర్, పల్వాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకు భారీగా మద్దతు లభిస్తున్నది. చారిత్రాత్మక భారత్ బంద్ తర్వాత వివిధ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సమావేశాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులకు రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు యూపీ ప్రభుత్వం చెరకు ధరలను స్వల్పంగా పెంచడంపై చెరకు రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన కార్యక్రమంలో రైతులను బెదిరించిన కేంద్రమంత్రి అజరు మిశ్రా టెనికి వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళన చేశాయి. అక్టోబర్ 9న పాట్నాలో బీహార్ రైతు సంఘాలు సమావేశం కానున్నాయి. తదుపరి కార్యక్రమాలు, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర యూనిట్ ఏర్పాటు గురించి చర్చ జరుగుతుంది. అక్టోబర్ 7న బెంగళూరులో ఉమ్మడి కర్నాటక సమన్వయ సమితి సమావేశం జరగనున్నది. మరిన్ని రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు నిర్వహణపై చర్చించనున్నారు.