Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ అధికారాన్ని చట్టసభలు సైతం లాక్కోలేవు : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : ధిక్కారంపై కోర్టులకు ఉన్న అధికారం తిరుగు లేనిదని, దీనిని చట్టసభలు సైతం లాక్కోలేవని సుప్రీం కోర్టు బుధవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తుల పైన, కోర్టు సిబ్బందిపైన బురద జల్లుతూ పదే పదే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు (పిల్స్) వేస్తూ కోర్టు సమయాన్ని హరిస్తున్నారన్న కేసులో ఎన్జిఓ సంస్థ 'సూరజ్ ఇండియా ట్రస్ట్ ' చైర్ పర్సన్ రాజీవ్ దైయాను సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారిం చింది. కోర్టులను నిందించినందుకు రూ.25లక్షలు డిపాజిట్ చేయాలని కోర్టు గతంలోనే ఆదేశించింది. అయినా ఆయన పట్టించుకోలేదు. ఇది కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని జస్టిస్ సంజరు కృష్ణ కౌల్, ఎం ఎం సుందరేష్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం చెప్పింది. ఆ మొత్తాన్ని ల్యాండ్ రెవిన్యూ బకాయిల ను రాబట్టుకునే తరహాలోనే ఆయన ఆస్తుల నుంచి రాబట్టా లని సుప్రీం కోర్టు ఆదేశించింది.' కోర్టు ధిక్కార నేరానికి పాల్పడేవారిని శిక్షించే అధికారం కోర్టుకు ఉంది. రాజ్యాంగం కల్పించిన ఈ అధికారాన్ని చట్ట సభలు సైతం లాక్కోజాలవు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కారంపై తదుపరి విచారణ జరిగే అక్టోబరు7న దైయా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టులపై బురద చల్లే కార్యక్రమం సాగిస్తున్న మీపై కోర్టు ధిక్కార నేరం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని దైయాకు సుప్రీం నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టు డివిజన్‌బెంచ్ ముందు దైయా తన వాదన వినిపిస్తూ, అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విధంగా ఆ మొత్తాన్ని చెల్లిం చేందుకు తనదగ్గర డబ్బుల్లేవని, దీనిపై రాష్ట్రపతినిక్షమాభిక్ష ప్రసాదించమని కోరతానని అన్నారు. దైయా కొన్నేళ్లుగా 64 పిల్స్ దాఖలు చేశారు.ఒక్కటీ ఫలించలేదు. ఇది కోర్టు సమయాన్ని వృథా చేయడం తప్ప మరొకటి కాదంటూ 2017లోనే కోర్టు ఖర్చుల కింద రూ.25 లక్షల డిపాజిట్ చేయాలని కోరిన విషయాన్ని డివిజెన్ బెంచ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. కోర్టు ధిక్కారానికి సంబంధించి సుప్రీం చేసిన వ్యాఖ్యలు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌కు కూడా ఒక హెచ్చరిక అనే చెప్పాలి. గత శనివారం అగర్తలాలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కోర్టు ధిక్కారం గురించి భయపడొద్దు అని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.