Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ ప్రజావ్యతిరేకి
- ప్రజలపై భారాలు మోపి పీల్చిపిప్పి చేస్తున్న ప్రభుత్వం
- ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ...హక్కుల కాలరాత
- ప్రజా సమస్యలపై దేశ రాజధానిలో వామపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలోని కార్పొరేట్ అనుకూల విధా నాలతో ప్రజలపై భారాలు మోపి పీల్చిపిప్పిచేస్తున్న మోడీ సర్కార్ దేశాన్ని అమ్మేస్తున్నదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. ప్రజా వ్యతిరేకి మోడీ సర్కార్ దేశాన్ని అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. ప్రజా, దేశ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాల అవలంభి స్తోన్న మోడీ భాగోతాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. గురువారం నాడిక్కడ జంతర్ మంతర్‌లో ప్రజల సమస్యలపై సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, సీజీపీఐ తదితర వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, నిరు ద్యోగం పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీ కరణ, రైతు వ్యతిరేక చట్టాలు, లేబర్ కోడ్ రద్దు చేయాల న్న తదితర డిమాండ్లతో వామపక్ష కార్యకర్తలు ఆం దోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని పెద్ద పెట్టున మోడీ సర్కార్ వ్యతిరేక విధానాలపై గళం విప్పారు. ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడుతూ దేశ సంపదను కొంత మంది కార్పొరేట్లకు అప్పన్నంగా మోడీ సర్కార్ దోచిపెడుతున్నారని విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్నారనీ ఆరోపిం చారు. అక్టోబర్ 1 నుంచి 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రయివేటీకరణ చేయాలని నిర్ణయించడం దారుణమనీ, మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకి స్తున్నామని అన్నారు. రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న 220 ఏండ్ల చరిత్ర కలిగిన ఇండియన్ ఆర్డి నెన్స్ ఫ్యాక్టరీలను విచ్ఛిన్నం చేయడం దారుణమన్నారు. సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు రోజు రోజుకూ పెరుగుతు న్నాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్నారు. ఒకవైపు కొత్త ఉద్యోగాలు కల్పించకపోవడం, మరోవైపు ఉద్యోగాలు కోల్పోవడమే దీనికి కారణమని అన్నారు. కార్మిక హక్కులు కాలరా సేందుకే లేబర్ కోడ్లు తీసుకొచ్చారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా కార్మికులు చేపట్టే ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలం గా, రైతులకు, వినియోగదారులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శులు ప్రొఫెసర్ దినేష్ దినేష్ వర్షణీ, శత్రుజీత్ సింగ్, ధర్మేంద్ర కుమార్ వర్మ, సీపీఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు సుచేత దే, సీజీపీఐ నేత బ్రిజు నాయక్, సీపీఐ(ఎం) నేత మొమూనా మొల్లా తదితరులు పాల్గొన్నారు.