Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే పార్లమెంటులో బిల్లులు : కేంద్ర సర్కార్ కసరత్తు
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరణ చేసేందుకు ఉద్దేశించిన బిల్లులను పార్లమెంట్ ముం దుకు తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకు సంబంధించి రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టే యోచ నలో ఉన్నది. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయి వేటీకరించాలనే తన ఎజెండాను పూర్తిచేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్న మోడీ ప్రభుత్వం, రాబోయే పార్ల మెంటు శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949లో సవరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే బ్యాంకుల ప్రయివేటీకరణ కోసం బ్యాంకింగ్ కంపెనీల (అక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్ టేకింగ్స్) చట్టం- 1970, బ్యాంకింగ్ కంపెనీల (అక్విజిషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అండర్ టేకింగ్స్) చట్టం-1980లో సవరణలు చేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రెండు బిల్లులను కూడా శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశముందని తెలిపారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో బ్యాంకుల జాతీయీకరణ సమయంలో చేసిన ఈ చట్టాలను మోడీ సర్కార్ సవ రణలు చేసేందుకు సిద్ధపడింది. ప్రభుత్వరంగ బ్యాంకు లను ప్రయివేటీకరించాలంటే, ఈ చట్టాల్లో నిబంధనల ను సవరించాల్సి ఉంటుంది. ఈ సవరణలతో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను ప్రస్తుతం ఉన్న 51 శాతం నుంచి తగ్గించే అవకాశం ఉంది. అయితే ప్రయివేటీకరించాల్సిన రెండు బ్యాంకులను ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. కనీసం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించాలని యోచిస్తున్న ట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే చెప్పా రు. ప్రయివేటీకరించే బ్యాంకుల్లో ప్రభుత్వ పాత్రను తగ్గించడం ద్వారా కార్పొరేట్ కిందకు తీసుకువస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు తాజా మూలధనంతో పాటు విదేశీ పెట్టుబడులు కూడా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి ఆహ్వానిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
2021-22 కేంద్ర బడ్జెట్లో సీతారామన్ ఒక ప్రధాన ప్రయివేటీకరణ ఎజెండాను ప్రకటించారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీ ప్రయివేటీకరణ చేస్తామని ప్రకటించారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికల (డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్స్) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ), ఐడీబీఐ బ్యాంక్లో మిగిలిన వాటా విక్రయాల మెగా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021-22 కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థల్లో వాటాలు అమ్మడం ద్వారా ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్లు సేకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే బ్యాంకుల ప్రయివేటీకరణకు పచ్చ జెండా ఊపింది.