Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్ : పంజాబ్‌లో కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా...? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఉండను.. బిజెపిలో చేరనూ అని చెప్పిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణాన అమరీందర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో తన నూతన పార్టీ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో తనకు మద్దతునిచ్చే వారితో సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. సిద్ధు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారూ... తనకు అనుకూలురుతో ఆయన చర్చలు జరుపుతున్నారని, ఒక వేళ పార్టీని ఏర్పాటు చేస్తే... వీరంతా కూడా పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే పంజాబ్‌లోనూ కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.