Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర హోంమంత్రి పాటిల్
ముంబయి : పలు దోపిడీ కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ దేశం విడిచి వెళ్లిపోవచ్చనే ఊహాగానాల మధ్య ఆయన కోసం పోలీసులు వెతుకుతాట ప్రారంభించారని మహరాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ పేర్కొన్నారు. గురువారం మంత్రి పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఆయనపై ఉన్న అభియోగాల విచారణ కోసం ఏర్పాటు చేసిన చందీవాల్ కమిషన్ ఎదుట హాజరు కావాలని పరంబీర్ సింగ్‌పై లుకౌట్ నోటీసులు కూడా జారీచేశామని చెప్పారు. '' ఒకవేళ పరంబీర్ గనుక దేశం నుంచి వెళ్లిపోతే.. అది ఎంతమాత్రం మంచిది కాదు'' అని పేర్కొన్నారు. మంత్రి అయినా, సీనియర్ అధికారి అయినా, ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం కోసం పనిచేసే వారు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తెలియజేయకుండా వీరెవరూ దేశం నుంచి విడిచి వెళ్లకూడదని, ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు.
పరంబీర్‌పై ఏవిధమైన చర్యలు తీసుకుంటారని మీడియా అడిగిన ప్రశ్నక మంత్రి పాటిల్ స్పందిస్తూ.. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి ఆయన కోసం వెతుకుతున్నామని, గుర్తించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.