Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు నేవీ సిబ్బంది గల్లంతు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని త్రిశూల్ పర్వతోరోహణకు వచ్చిన నేవీ బృందంలోని ఐదుగురు హిమపాతం కారణంగా గల్లంతయ్యారు. వీరి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
7100 మీటర్లు ఎతైన త్రిశూల్ పర్వతం ఆధిరోహించడానికి సెప్టెంబరు 3న ముంబయి నుంచి 20 మందితో కూడిన నేవీ బృందం వచ్చింది. శుక్రవారం ఉదయం వీరిలో 10 మంది పర్వతోరోహణ చివరి దశను ప్రారంభించగా, ఆకస్మిక హిమపాతంతో వీరిలో ఐదుగురు గల్లంతయ్యారు.
మిగిలిన ఐదుగురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.