Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్‌ను ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ ఇరికించడానికి యూపీ ప్రభుత్వం యత్నిస్తోంది. యూపీ ప్రభుత్వం రద్దు చేయాలని భావించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఉగ్రవాద సంస్థతో కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ యూపీ పోలీస్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం చార్జిషీట్లో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నమోదు చేసిన ఐదువేల పేజీల చార్జిషీట్‌ను నేడు మథువా కోర్టులో సమర్పించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ సామూహిక హత్యాచార కేసును రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన కప్పన్‌ను గతేడాది పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కప్పన్‌కు యూపీలో రద్దు చేసిన స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఎంఐ) సంస్థతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. సిద్ధిఖీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాసిన 36 ఆర్టికల్స్‌ను చార్జిషీట్లో పేర్కొన్నారు. కాగా, 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు (సీసీఏ)కి వ్యతిరేకంగా రాసిన ఆర్టికల్ కూడా ఒకటి. సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌లో ఆందోళన చేపడుతున్న వారిపై హిందూ మతానికి చెందిన కలిల్ గుజార్ కాల్పులు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనను మహాత్మా గాంధీపై దాడితో పోల్చారు. అలాగే నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆ ఆర్టికల్‌లో వివరించారు. అల్లర్ల సమయంలో నిర్దిష్టమైన వర్గాన్ని మాత్రమే హైలెట్ చేస్తూ.. వారికి సంబంధించిన సంఘటనలను మాత్రమే ప్రచురించినపుడు ఆ సంఘంలోని సభ్యులు ఆగ్రహానికి గురవ్వచ్చని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన రిపోర్టర్లు అటువంటి మత ఘర్షణలను రిపోర్ట్ చేయరని, కానీ సిద్ధిఖీ ముస్లింల గురించి ప్రత్యేకంగా వివరించారని, ఆయన అజెండా పీఎఫ్ఐ అజెండా అయిన అల్లర్లు, మత పరమైన భావాలను రెచ్చగొట్టడమని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడానికి నిజాముద్దీన్ మర్కజ్ కుట్ర పన్నిందంటూ కేంద్రం పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ.. ముస్లిముల పరువు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక యత్నమని ఆర్టికల్‌లో రాశారు. ఈ ఆర్టికల్స్ అన్నీ ఎస్ఐఎంఐ సభ్యుల సహకారంతో రాశారని, నిషేధిత ఉగ్రవాద సంస్థ చట్టబద్ధత కల్పించేయత్నమని చార్జిషీట్లో పేర్కొన్నారు.