Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ, తెలంగాణలో బూతుపురాణం
- మంత్రులే బూతులు మాట్లాడుతున్నారు
- అదానీ పోర్టు నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా
- మీడియాతో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
న్యూఢిల్లీ : ప్రజలెదుర్కొంటున్న సమస్యల నుంచి.....దృష్టి మళ్లించేందుకే బూతు పురాణాలు, అనవసరపు చర్చలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మంత్రులే బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ ఏపీ భవన్లో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మీడియాతో మాట్లాడారు. దేశం మాదకద్రవ్యాల ఉచ్చులు పడిపోతున్నదని అన్నారు. రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చే అదానీ ప్రధాని మోడీ దత్తపుత్రుడని, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా శిష్యుడని పేర్కొన్నారు. అదానీకి సముద్ర తీరా ప్రాంతాలన్నీ కట్టబెడుతున్నారనీ, పోర్టులు, ఎయిర్ పోర్టులు అన్ని వారికే దోచిపెడుతున్నారని విమర్శించారు. ముంద్రా పోర్టు నుంచి విజయవాడకు మాదక ద్రవ్యాలు వచ్చాయనీ, ముంద్రా పోర్టు యజమాని అదానీ అని పేర్కొన్నారు. అదానీ సూచనల మేరకే అంతర్జాతీయ స్థాయిలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ జరగతున్నట్టు స్పష్టమైందన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే తీరా ప్రాంతాలన్నీ అదానీకి అప్పజెప్పారనీ, ఏపీలోని తడ నుంచి ఇచ్ఛాపురం వరకు తీరా ప్రాంతాలన్నీ అదానీకి కట్టబెడుతున్నారని విమర్శించారు.