Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : చరిత్రను వక్రీకరిచేందుకు, విద్యను కాషాయీకరణ చేసేందుకు సంఫ్ుఫరివార్ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని ఎస్ఎఫ్ఐ కోరింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు విపి సాను, ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంఘ్ పరివార్ శక్తుల నుంచి ఇటువంటి ప్రయత్నాలు కొత్తేమీ కాదని, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇవి బహిరంగంగా జరుగుతున్నాయని విమర్శించింది. ప్రత్యామ్నాయ చరిత్ర, సూడో సైన్స్, ఇతర హిందూత్వ అజెండా ప్రచారంలో పలు ఉన్నత విద్యా సంస్థలు కూడా చేరడం విచారకరమని తెలిపింది. యోగా గురు, అధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌తో ఐఐటి ఖరగ్‌పూర్ ఇన్స్టిట్యూట్ యంత్రాంగం ఒక కార్యక్రమాన్ని నిర్వహించిందని తెలిపింది.