Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ ప్రాంతాల్లో 8.6 శాతం
- గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం నమోదు: సీఎంఐఈ
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం రేటు 6.86 శాతానికి చేరుకుందని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సెప్టెంబర్ నెలలోని నిరుద్యోగ రేటు వివరాలను వెల్లడిం చింది. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 8.62 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 6.06 శాతం నిరుద్యోగ రేటు ఉందని పేర్కొంది. దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు రెండంకెలు దాటింది. అత్యధికంగా జమ్మూకాశ్మీర్ (21.6 శాతం), హర్యానా (20.3 శాతం), రాజస్థాన్ (17.9 శాతం), ఢిల్లీ (16.8 శాతం), త్రిపుర (15.3 శాతం), జార్ఖండ్ (13.5 శాతం), పుదుచ్చేరి (11.2 శాతం), బీహార్ (10శాతం) రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు నమోదైంది. ఆంధ్ర ప్రదేశ్లో 6.3శాతం, తెలంగాణలో 3.7 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ రేటు ఆగస్టులో (6.5 శాతం) కంటే సెప్టెంబర్లో (6.3 శాతం) స్వల్పంగా తగ్గింది. తెలంగాణలో నిరుద్యోగ రేటు ఆగస్టులో (4.7 శాతం) కంటే, సెప్టెంబర్లో (3.7 శాతం) కాస్త తగ్గింది.