Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18వ ఫేజ్ బాండ్ల అమ్మకాన్ని చేపట్టిన కేంద్రం
- ఇందులో క్విడ్ ప్రోకో దాగుంది : సీతారాం ఏచూరి
- ఎన్నికలు మొదలైనప్పుడల్లా ఇదే దందా : హక్కుల కార్యకర్తలు
- సుప్రీం వెంటనే విచారణ చేపట్టాలి..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సమయంలో, మోడీ సర్కార్ ఎన్నికల బాండ్ల అమ్మకాన్ని షురూ చేసింది. శుక్రవారం నుంచి ఎన్నికల బాండ్ల అమ్మకాలు మొదలవుతా యని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎన్నికల బాండ్ల అమ్మకాల వ్యవహారంపై సీపీఐ(ఎం), సీపీఐ..మొదలైన పార్టీలు ఆం దోళన వ్యక్తం చేస్తున్నాయి. బాండ్ల అమ్మకం తో ఎన్నికల్లో అవినీతి మరింత పెరుగుతోం దని, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికల తంతును ఇది దెబ్బతీస్తోందని హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ఎన్నికల బాండ్ల అమ్మకాన్ని చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖల య్యాయి. బాండ్ల అమ్మకానికి సవాల్ చేస్తూ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కార్పొ రేట్ కంపెనీలు, రాజకీయ నేతలకు తెరవెను కున్న ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఎన్నికల బాండ్లు ఒక సాధనంగా మారాయని, కేంద్ర ఎన్నికల సంఘం 2017లో బాండ్ల అమ్మకంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేసిందని సీతారం ఏచూరి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లన్నింటినీ వెంటనే విచారణ చేయాలని సుప్రీంకోర్టును ఏచూరి మరోమారు కోరారు.
బాండ్ల అమ్మకంలో క్విడ్ ప్రోకో..అవినీతి పెద్ద ఎత్తున ఉందని ట్విట్టర్లో ఆయన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఎన్నికల బాండ్లపై దాఖలైన పిటిషన్లను విచారించాలని సీపీఐ(ఎం) కూడా ఈ ఏడాది జులైలో సుప్రీం కోర్టును కోరింది. బాండ్ల అమ్మకం ద్వారా ఏ ఏ కార్పొరేట్ సంస్థ, కంపెనీ విరాళాలు ఇచ్చాయనేది బహిరంగ పర్చాలని, ఈ సమాచారం తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని సుప్రీంకు సమర్పించిన పిటిషన్లో సీపీఐ(ఎం) పేర్కొంది.
ప్రజాస్వామ్యానికి ముప్పు..
ఎన్నికల బాండ్ల అమ్మకం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖల య్యాయి. ఇవన్నీ 2018 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. బాండ్ల పథకం అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది.
వివిధ రాజకీయ పార్టీలకు వేల కోట్లు విరాళాలు బాండ్ల పథకం ద్వారా వస్తున్నాయి, ఇది దేశ ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పు తెచ్చిపెడుతు ం దని సీపీఐ(ఎం) మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది.ఈ పథకం మొదలైన తర్వాత అధికార బీజేపీ పార్టీకి వేల కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఎవరెవరు..ఈ విరాళాలు ఇచ్చారన్నది మాత్రం బయటి ప్రపంచానికి తెలియటం లేదు.
పార్టీ నిధుల్లో 70శాతం లెక్కాపత్రం లేనివే : ఏడీఆర్, ఎన్జీఓ సంస్థ
ఇప్పటివరకూ బాండ్ల ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు అందిన నిధుల్లో 70శాతం ఎవరిచ్చారన్నది గుర్తించడం సాధ్యం కాదు. ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్స్‌ను కేంద్ర ఈసీకి వివిధ రాజ కీయ పార్టీలు ఇస్తున్నాయి.ఇందులో బాండ్ల విరా ళాలు ఎవరు ఇచ్చారన్నది తెలియజేయ టం లేదు. 15ఏండ్లలో వివిధ పార్టీలకు బాండ్ల ద్వారా, ఇతర మార్గాల్లో వచ్చిన లెక్కా పత్రంలేని విరాళాలుదాదాపు రూ.14,651కోట్లు ఉన్నాయి. 2019- 20లో రూ.3,377కోట్లు పార్టీ ఆదాయంగా బీజేపీ చూపింది. ఇందులో రూ.2,642కోట్లు 'గుర్తించలేని వర్గాల' ద్వారా ఆదాయం సమకూరిందని తెలిపింది.