Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికార అండతో రెచ్చిపోయే
- అధికారులకు శిక్షలు తప్పవంటూ వ్యాఖ్య
న్యూఢిల్లీ: అధికారులు, పోలీసులపైదాఖలైన ఫిర్యాదుల పరిష్కారాని కి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలో ప్రత్యేక స్థాయీ సంఘం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ అన్నారు. మరీ ముఖ్యంగా దేశంలో అధికారులు,ప్రత్యేకించి పోలీసు అధికారుల పనితీ రుపై సీజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.అధికార పార్టీల అండతో అక్రమాలు, దురాగతాలకు పాల్పడుతూ చెలరేగిపోయే పోలీసులను ఆ తర్వాత న్యాయస్థానాలు కూడా రక్షించలేవని స్పష్టంచేశారు.అలాంటి అధికారులు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సింద ేనన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కొని కోర్టులను ఆశ్రయించడం కొందరు అధికారుల కు,ముఖ్యంగా పోలీసులకు ఓ అలవాటుగా మారిందనీ,దేశంలో ప్రస్తుతం ఇదో ట్రెండ్‌గా కొనసాగుతున్నదంటూ అసహనం వ్యక్తం చేశారు.