Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7లక్షల మరణాలు ఒక్క అమెరికాలోనే
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య శుక్రవారానికి 50లక్షలు దాటింది. ఒక్క అమెరికాలోనే 7లక్షల మంది చనిపోగా, బ్రెజిల్లో 6లక్షలు, భారత్‌లో సుమారు 5 లక్షల మంది వరకు మరణించారు. కోవిడ్ తలెత్తిన 2020లో 25లక్షల మంది మరణించగా, మిగిలిన 25లక్షల మంది ఈ ఏడాది ఇంతవరకు చనిపోయారని రాయిటర్స్ వార్తా సంస్థ విశ్లేషించింది. గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున ఎనిమిది వేల మరణాలు నమోదవుతున్నాయి. అంటే ప్రతి నిముషానికి దాదాపు ఐదుగురు చనిపోతున్నారన్నమాట. ఇటీవలి వారాల్లో చూసినట్లైతే ప్రపంచ మరణాల రేటు కాస్త నెమ్మదించింది. సంపన్న, పేద దేశాల మధ్య వ్యాక్సినేషన్ రేట్లలో గల అసమానతలు డెల్టా వేరియంట్‌తో మరింత స్పష్టంగా బయటపడ్డాయి.