Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961లో ఒక నిబంధన ప్రకారం మూడు నెలల్లోపు శిశువును దత్తత తీసుకున్న తల్లి 'ప్రసూతి సెలవులు' పొందేందుకు అర్హురాలు. దత్తత తీసుకున్న శిశువు వయస్సు మూడు నెలలు దాటరాదు. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకాగా, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీచేసింది. చట్టంలోని సెక్షన్ 5(4)...దత్తత తల్లుల పట్ల వివక్ష చూపుతోందని, మూడు నెలలు దాటిన అనాథ, తప్పిపోయిన పిల్లలను దత్తత స్వీకరించడానికి నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, జువెలియన్ జస్టిస్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ఉందని పిటిషన్‌దారు ఆరోపించారు. ఒకవేళ మూడు నెలలలోపు అనాథ శిశువును దత్తత స్వీకరించే సందర్భంలోనూ దత్తత తల్లికి ప్రసూతి సెలవులు పొందేందుకు అడ్డంకులు వస్తున్నాయని, దత్తత ప్రక్రియ ముగియడానికి కొన్ని నెలలు పడుతోందని, అప్పుడు తల్లి ప్రసూతి ప్రయోజనాలు పొందలేకపోతోందని పిటిషన్‌దారు సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961లో సెక్షన్ 5(4) రాజ్యాంగబద్ధత చెల్లుబాటు కాదని ఆరోపించారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.