Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కైలాష్ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ, చైర్మెన్ డాక్టర్ మహేశ్ శర్మ
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మూడోవేవ్ అక్టోబర్-డిసెంబర్ మధ్య వచ్చే అవకాశముందని 'కైలాష్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్' ఎండీ, చైర్మెన్ డాక్టర్ మహేశ్ శర్మ చెప్పారు. 'హెల్త్‌గిరి' అవార్డు పురస్కార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా రెండోవేవ్‌కు దేశం సన్నద్ధత కాకపోవటం తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిందని, ఆరోగ్యసిబ్బంది, వైద్యులు కూడా మానసికంగా సిద్ధంకాలేకపోయారని ఆయన చెప్పారు. అందువల్లే ఆక్సీజన్, రెమ్‌డెసివర్ మందుల కొరత ఏర్పడ్డాయని అన్నారు. మనదేశంలో కరోనా మూడోవేవ్ అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో వచ్చే అవకాశముందని మరో వైద్య ప్రముఖుడు 'బనారస్ హిందూ వర్సిటీ' ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే చెప్పారు.
అయితే రెండోవేవ్ అంతటి ఉధృతి ఉండకపోవచ్చునని, మరణాలు ఆ స్థాయిలో ఉండవని ఆయన అంచనావేశారు. ఇప్పుడు ప్రజల్లో అత్యధికశాతం మంది వాక్సిన్ పొంది వుండటం, అలాగే అనేకమంది కోవిడ్ బారినపడటమూ కలిసివచ్చే అంశమని అన్నారు.
దేశంలో మూడో వేవ్ వచ్చే అవకాశం తక్కువేనని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ కొద్ది వారాల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. వైరస్‌లో కొత్త వేరియెంట్స్ రాకపోతే..మూడోవేవ్ గురించి భయపడాల్సిన పనిలేదని గగన్‌దీప్ కాంగ్ అన్నారు. అంతేగాక దేశ జనాభాల్లో అత్యధికమందికి వాక్సిన్ వేయటం, ఇదివరకే కోవిడ్ రావటం..మూడో ప్రభావాన్ని తగ్గిస్తుందని అంచనావేశారు. పండుగలవేళ ప్రజలంతా అప్రమత్తతో ఉండాలని, మరో 6-8వారాలు జాగ్రత్తగా ఉంటే కోవిడ్-19 మరింత తగ్గుముఖం పడుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.