Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి సిద్ధూ డిమాండ్
ఛంఢఘీర్ : పంజాబ్ డిజిపిను, అడ్వకేట్ జనరల్ (ఎజి)ను తొలగించాలని కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సిద్ధూ ట్విట్ చేశారు. దీంతో రాష్ట్రంలో కీలకమైన నియామాకలపై సిద్ధూ అసంతృప్తిగానే ఉన్న విషయం వెల్లడవుతుంది. 'సాక్రిలేజ్ కేసుల్లో న్యాయం కోసం, డ్రగ్స్ వ్యాపారం వెనుక ఉన్న ప్రధాన నిందితుల్ని అరెస్టు చేయడం కోసం 2017లో మన ప్రభుత్వం అతన్ని నియమించింది. అతని వైఫల్యం కారణంగా, గత సిఎంను ప్రజలు తొలగించారు. ఎజి,డిడి నియామకాలు బాధితుల గాయాలను రెచ్చగొడు తున్నాయి. వారిని తొలగించాలి' అని సిద్ధూ ఆదివారం ట్విట్ చేశారు.