Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్ము : పాకిస్తాన్కు చెందిన డ్రోన్ నుంచి జారవిడిచినట్లుగా భావిస్తున్న ఆయుధాలను జమ్ము పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ నుంచి పడిన ప్యాకెట్లో ఒక ఎకె అస్సాల్డ్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, 30 రౌండ్లు, ఒక టెలిస్కోప్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌంజన గ్రామం నుంచి శనివారం అర్థరాత్రి వీటిని స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ నుంచి ఈ ప్యాకెట్ పడినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపధ్యంలో పోలీసులు గ్రామంలో తనిఖీలు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయడమే కాకుంగా, భారత భూ భాగంలో ఈ ఆయుధాలను తీసుకునే వ్యక్తులను గుర్తించడాన్ని కూడా ప్రారంభించారు.