Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూడిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో పదివేల మందికి పైగా రైతులు సమావేశమయ్యారు. నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందేనని, గిట్టుబాటు ధరను గ్యారెంటీ చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక చెరకు సాగుదారులు ఈ నెల 5న బెంగళూరులో అసెంబ్లీ ఘెరావ్ ప్రకటించారు. యమునానగర్ (హర్యానా) అలిపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పిఎం సంవాద్ కార్యక్రమంలో పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు నిరసన చేపట్టారు. పంజాబ్లోని లూథియానాలో బిజెపి కార్యక్రమం జరగడానికి అనుమతించలేదు.
చంపారన్ నుండి వారణాసికి లోకనీతి సత్యా గ్రహ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది.పంజాబ్ రైతులపై కేసుల ఉపసంహరణ రైతులపై బనాయించిన కేసులను ఉపసంహరించు కుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్ని తెలిపారు. ధర్నాల సందర్భంగా రైల్వే ట్రాకులపై బైఠాయించిన రైతు సంఘాల సభ్యులపై ఆర్పిఎఫ్ నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.