Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : బద్వేల్ ఉప ఎన్నికల బరి నుంచి ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ వైదొలిగింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పొటిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఖాళీ ఏర్పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధకు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నందునే తాము ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు టిక్కెట్ కేటాయిస్తే అభ్యర్థిని ప్రకటించకూడదనే గత సాంప్రదాయాన్ని కొనసాగించాలని తమ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. జనసేన కూడా ఈ స్థానం లో తాము పోటీ చేయడం లేదని ఇదివరకే ప్రకటించింది.