Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలాసవంతమైన నౌకలో రేవ్ పార్టీ
- ఒకరోజు కస్టడీ విధింపు...
ముంబయి : విలాసంతమైన నౌకలో శనివారం రాత్రి రేవ్ పార్టీ జరుగుతోన్న సమయంలో మాదకద్రవ్యాల నిరోధక శాఖ (ఎన్సీబీ) అధికారులు దాడి చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్‌ఖాన్ కుమారుడు అర్యన్ ఖాన్‌తో సహా ఎమినిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ముంబయి తీరంలో నుంచి గోవా వెళుతున్న కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెస్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎన్సీబీ అధికారులు ఈ దాడి చేశారు. ఒక ప్రయివేట్ లైఫ్ స్టైయిల్, ఫ్యాషన్ టివి ఛానల్ ఈ పార్టీని నిర్వహిస్తోంది. సుమారు 22 మంది అధికారులు ఈ నౌకలోకి వీఐపీ పాసులతో గెస్టులుగా ప్రవేశించారు. శనివారం సాయంత్రం నౌక బయలుదేరి సముద్ర మధ్యలోకి వెళ్ళిన కొన్ని గంటలు తరువాత పార్టీ ప్రారంభమవ్వడంతో ఒక్కసారిగా దాడి చేశారు. కొకైన్, గంజాయి, ఎండీఎంఏ వంటి మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు. నౌకలో 1800 మంది గెస్టులు ఉన్నట్లు సమాచారం. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆర్యన్ ఖాన్‌తోపాటు అర్బాజ్ మర్చంట్, దమేచాను, నుపుర్ సారికా, ఇస్మీత్ సింగ్, మోహక్ జైస్వాల్, విక్రాంత్ ఛోకేర్, గోమిత్ చోప్రా ఉన్నారు. వీరిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను ముంబయి తీసుకుని వచ్చారు. 'ఎనిమిది మందిని విచారించాం. వీరి వాంగ్మూలం ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి' అని ఎన్సీబీ తెలిపింది. ఎన్డీపీఎస్ కోర్టులో వీరిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, ఈ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని నౌక యాజమాన్యం ప్రకటించింది. కాగా, ఈ నౌకలో రేవ్ పార్టీ జరగనున్నట్లు 15 రోజుల క్రితమే ఎన్సీబీ అధికారులకు సమాచారం లభించింది. ఒకరోజు కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.