Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు అనుబంధ సంస్థల జాబితా సిద్ధం
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని థర్మల్ ఎనర్జీ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ రూ.15,000 కోట్ల ఆస్తుల మానిటైజేషన్ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రభుత్వం ఎన్టీపీసీ మూడు అనుబంధ సంస్థలను జాబితా చేసింది. వాటిలో ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపర్ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌వీవీఎన్), నార్త్ ఈస్టెర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్ఈఈపీసీవో), ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్ఆర్ఈఎల్) ఉన్నాయి. ఇందులో ఎన్ఆర్ఈఎల్ ప్రభుత్వ యాజమాన్యంలోని సెయిల్ జాయింట్ వెంచర్‌గా ఉంది. దీనిపై ఎన్టీపీసీ సీనియర్ అధికారులు మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈఎల్ను వచ్చే ఏడాది అక్టోబర్ కంటే ముందుగానే జాబితా చేయబడుతుందని వెల్లడించారు. ఎన్టీపీసీ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ జూన్‌లో ఎన్ఆర్ఈఎల్ను త్వరగానే జాబితా చేస్తామని పేర్కొన్నారు. నిధుల సేకరణ కోసం త్వరలోనే ప్రజల్లోకి వెళ్లామని తెలిపారు. కాగా, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మిథనాల్, పరిశుభ్రమైన ఇంధనాలపై పెట్టుబడులు పెట్టాలని చూస్తోంది. త్వరలోనే మధ్యప్రదేశ్‌లో దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును వింధారుచల్ థర్మల్ పవర్ యూనిట్లో ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.