Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికంగా సమాన లేదా ఆపై ఉన్న మహిళలకు భర్తల నుంచి గృహహింస
- తాజా అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: సమాజం లో లింగ వివక్ష, పితృస్వామ్యం ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మహిళలపై హింస పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా తమ భర్తల ఆర్థిక స్థితి సమానమైన లేదా మించిన మహిళలు గృహహింసను ఎదుర్కొనే అవకాశముందని తాజాగా ఓ అధ్యయం గుర్తించింది. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంతో మహిళలది ధృడమైన పాత్ర ఉందనీ, అయితే, పితృస్వామ్య శక్తిని సమతూల్యతను తిరిగి స్థాపించడానికి పురుషులు మహిళలపై హింసకు పాల్పడుతున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. హైపర్గామికి వ్యతిరేకంగా ఉండే వివాహిత మహిళలు 14 శాతం ఎక్కువ హింసను ఎదుర్కొనే అవకాశముందని తెలిపింది. హైపర్గామస్ వివాహాలలో ఉన్న మహిళలతో పోల్చినప్పుడు మహిళలు ఉన్నత సామాజిక స్థాయి గల పురుషులను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు ఈ అధ్యయన పరిశోధకులు పేర్కొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్హామ్(యూనైటెడ్ కింగ్డమ్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(హైదరాబాద్) పరిశోధ కులు సంయుక్తంగా కలిసి ఈ అధ్యయనం చేశారు. దీనిలో భాగంగా సామాజిక, ఆర్థిక నేపథ్యాలు-కులం, తరగతి, వయస్సు, నివాస ప్రాంతం వంటి అంశాలను వివాహితులైన జంటల నుంచి వచ్చిన స్పందనల ఫలితాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గృహహింస మహిళలపై వేధింపులకు అత్యంత సాధారణ రూపంగా మారింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత అధ్యయనం హింసకు సంబంధించిన ప్రశ్నలకు 15-49 సంవత్సరాల వయస్సు గల 65,806 మంది మహిళల ఎన్ఎఫ్హెచ్ఎస్-4 డేటా, ప్రతిస్పందనలను విశ్లేషించింది. సర్వేకు ముందు 12 నెలల్లో 27 శాతం మంది శారీరక హింసతో, 5 శాతం లైంగిక హింసతో, 11 శాతం భావోద్వేగ హింసతో, 25శాతం ఇతర హింసలకు గురయ్యారని కనుగొంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కానీ వారి శ్రేయస్సు వదిలివేయబడుతోంది. లింగ సమానత్వంపై విధానాలు తప్పనిసరిగా అమలు చేయదగిన చట్టం, జోక్యాలతో కూడి ఉండాలని ఈ అధ్యయనం పేర్కొంది. భారత్లో గత నాలుగు దశాబ్దాల్లో భార్యల కంటే మెరుగైన విద్యను కలిగివున్న పురుషుల శాతం 90 నుంచి 60 శాతానికి పడిపోయింది. భర్తల కంటే మెరుగైన విద్యను కలిగివున్న భార్యల శాతం 10 శాతం కంటే తక్కువ నుంచి 30 శాతానికి పెరిగింది. అయితే, వివాహాల్లో స్త్రీ సాధికారత కలిగివున్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. మరింత విద్యావంతులైనప్పటికీ.. వాస్తవంగా ఇప్పటికీ గృహ హింసకు ఎక్కువగా గురవుతున్నారని అధ్యయనం పేర్కొంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంలోనూ కుటుంబాల్లో పితృస్వామ్య వ్యవస్థ కొనసాగుతున్నదనీ, భార్యల పని, ఉపాధిపై కూడా ప్రభావం పడుతున్నదని తెలిపింది.