Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదురాష్ట్రాల ఎన్నికల ఖర్చుపై కేంద్ర ఎన్నికల సంఘం
- తృణమూల్ ఖర్చు రూ.154కోట్లు
- డీఎంకే రూ.114 కోట్లు, కాంగ్రెస్ రూ.84.93కోట్లు
న్యూఢిల్లీ : కొద్ది నెలల క్రితం ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందన్నది కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. అసోం, కేరళ, పుదుచ్చెరీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం వ్యయం వివరాలను బీజేపీ ఇంతవరకూ సమర్పించలేదని పేర్కొన్నది. ఇక పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా రూ.154.28 కోట్లు ఖర్చుచేసిందని ఈసీ వెల్లడించింది. ఆ తర్వాత అత్యధికంగా తమిళనాడుకు చెందిన డీఎంకే రూ.114కోట్లు ఖర్చుచేసినట్టు తేలింది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మొత్తం రూ.84.93కోట్లు ఖర్చుచేసినట్టు ఈసీకి సమర్పించిన నివేదికలో తెలిపి ంది. ఎన్నికల వ్యయంపై ఆయా పార్టీలు తమ నివేదికలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించగా, ఆ సమాచారాన్ని ఈసీ వెబ్సైట్లో విడుదల చేశారు. బీజేపీ మినహా వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయంపై ఇందులో సమాచారమున్నది. తమిళనాడు, పుదుచ్చెరీలో ఏఐఏడీఎంకే పార్టీ రూ.57.33కోట్లు ఎన్నికల వ్యయంగా చూపింది. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చెరీలో రూ.13.19కోట్లు ఎన్నికల ప్రచారంపై ఖర్చు చేశామని సీపీఐ ప్రకటించింది.