Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగని పెట్రో మంట
- మళ్లీ పెరిగిన ధరలు
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజీల్ ధరలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చుక్కలు చూపిస్తున్నాయి. మరీముఖ్యంగా, వాహనదారులు, సామాన్యప్రజలు పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 25పైసలు, డీజీల్‌పై 30 పైసలు పెరిగింది. దీంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీని దాటాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 102.39గా ఉండగా, డీజీల్ ధర రూ. 90.77 గా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.43 గా, డీజీల్ ధర రూ. 98.48 కి చేరి జనాలకు చుక్కలు చూపెట్టింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103కి, డీజీల్ ధర రూ. 93.87కి ఎగబాకింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.01 గా, డీజీల్ ధర రూ. 95.31 కు చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.95 కు, డీజీల్ ధర రూ. 96.34 కు చేరి ఆకాశాన్ని అంటాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.51కి ఎగబాకింది. లీటర్ డీజల్ ధర రూ. 99.04 కు పెరిగింది. ఈ విధంగా అడ్డూ అదుపు లేకుండా పెరగుతున్న ఇంధన ధరలు దేశంలోని ప్రజల్లో తీవ్ర ఆందోళననకు కలిగిస్తున్నాయి. దీంతో ధరలను అదుపు చేయడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై సాధారణ ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.