Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని పిలుపు
- రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుదామన్న స్టాలిన్
- ప్రధానంగా నీట్ ప్రస్తావన
చెన్నై : తెలంగాణ, ఏపీ, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ లేఖ రాశారు. విద్యారంగంలో రాష్ట్రాల హక్కులపై పోరాడుదామనీ, కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. కలసికట్టుగా పోరాడి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని తెలిపారు. తన లేఖలో ప్రధానంగా నీట్ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై నీట్ ప్రభావాన్ని ఎత్తిచూపారు. లేఖతోపాటు.. ఏకే రాజన్ కమిటీ నివేదిక కాపీని కూడా 12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ పంపారు.