Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేత, హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ప్రతిపక్షాలు సహా రైతుల తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతులపై బీజేపీ నేత, హర్యానా రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతులకు దెబ్బకు దెబ్బ కొట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలని బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. రైతులపై లాఠీలతో దాడి చేయండి.. ఆ తర్వాత మేము చూసుకుంటాం అంటూ సీఎం వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.